మోక్షద ఏకాదశి రోజున భద్ర, రవియోగంలో పూజిస్తే ఏం జరుగుతుంది?

మోక్షద ఏకాదశి ఎప్పుడో తెలుసుకున్నాం. ఆ రోజు ఏ ఏ యోగాలు ఏర్పడుతాయో తెలుసుకున్నాం. ఈ రోజున అరుదైన భద్రావస్ యోగం ఏర్పడనుందని తెలుసుకున్నాం. ఈ యోగం 11వ తేదీన మధ్యాహ్నం 02:27 గంటలకు ఏర్పడి 12వ తేదీ మధ్యాహ్నం 01:09 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను పూజిస్తే ఫలితం బాగుంటుంది. రవియోగంలో పూజిస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. ఈ కాలంలో లోకాన్ని పోషించే శ్రీమహావిష్ణువును, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మోక్షద ఏకాదశి నాడు పూజ ఏలా చేయాలో తెలుసుకుందాం.

మోక్షద ఏకాదశినాడు పూజా స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు, దీపాలతో అలంకరించి పీటాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై విష్ణుమూర్తి విగ్రహం లేదంటే చిత్రపటాన్ని పెట్టాలి. విష్ణువుకు పసుపు, పూలు, పండ్లతో పూజ చేయాలి. పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు పఠించాలి. ఆ తరువాత మోక్షద ఏకాదశి వ్రత కథ చదవడమో వినడమో చేయాలి. పూజ ముగింపులో స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తరువాత ఇంట్లోని వారికి ప్రసాదాలు పంచి.. మీకు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. శాస్త్రోక్తంగా పూజను పూర్తి చేస్తే మీ కోరికలు నెరవేరడంతో పాటు మీ ఇంట సిరి సంపదలు నెలకొంటాయని పండితులు చెబుతారు.

Share this post with your friends