బంగారం కలలోకి వస్తే ఏం జరుగుతుంది?

మనం నిత్యం కలలు వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని మనకు గుర్తుంటాయి.. కొన్ని గుర్తుండవు. అయితే కలలో ఏం కనిపిస్తుందనే దానిని బట్టి మన జీవితంలో ఏం జరుగుతుందనేది తెలియవస్తుంది. అందులోనూ తెల్లవారు జామున వచ్చే కలల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. తెల్లవారుజామున కల వస్తే మాత్రం అది నిజమవుతుందని చెబుతారు. కలలో మనకు అనేక వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకు కలలో బంగారం వస్తే అర్థం ఏంటనేది తెలుసుకుందాం.

కలలో బంగారం చేయి నుంచి జారిపడి కింద పడిపోయినట్టు వచ్చినా, పోగొట్టుకున్నట్లు వచ్చినా.. ఆర్థికంగా నష్టపోతారని అర్థమట. అలా కల వస్తే మాత్రం ఆర్థిక పరంగా జాగ్రత్త వహించాలని అర్థమట. పాత బంగారాన్ని అమ్మి కొత్త బంగారం తీసుకున్నా కూడా జీవితంలో ఆర్థికంగా మరింత బలపడతారని అర్థం. ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు కల వస్తే.. మీ సంపద పెరుగుతుందని సూచన. అలాగే కొత్త బంగారాన్ని కొంటున్నట్లు కల వస్తే మాత్రం ఆదాయం పెరిగే దానికి సూచనగా భావించాలట. ఇలా కల వస్తే మీరు ఎలాంటి పనులు చేసినా అన్నింటా విజయం సాధించడమే కాకుండా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది.

Share this post with your friends