శ్రీవారికి ధరింపజేసే పూలమాలలను ఏం చేస్తారు?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వారికి రోజుకు రెండు సార్లు తోమాల సేవ జరుగుతుంది. నిత్యం రోజుకు రెండు మార్లు పూలమాలతో అలంకరిస్తూ ఉంటారు. దీనిని తోమాల సేవ అని అంటారు. ఇక శ్రీ మలయప్ప స్వామివారికి ధరింపజేసే పూలమాలలకు ఒక్కోదానికి ఒక్కో పేరు ఉంది. అవేంటనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక శ్రీవారికి నిత్యం 250 నుంచి 300 కేజీల వరకూ పుష్పాలను అలంకరింపజేస్తూ ఉంటారు. ఇది సాధారణ రోజుల్లో మాత్రమే. ప్రత్యేక రోజుల్లో అయితే క్వాంటిటీ మరింత పెరుగుతుంది. మరికొన్ని ఎక్కువ కేజీల పుష్పాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది.

మరి రోజుకు ఇన్ని వందల కేజీల పూలను అలంకరిస్తారు కదా.. మరి వాటిని తీసివేసిన అనంతరం ఏం చేస్తారు? మలయప్ప స్వామి వారికి అలకరించిన పూల హారాలను ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు. రోజుకి రెండు సార్లు నిర్వహించే తోమాల సేవలు నిర్వహిస్తారు. ఈ సేవకు ముందు స్వామి వారికి అలంకరించిన పుష్పాలను సడలింపు చేస్తారు. అనంతరం ఆ పుష్పాలన్నింటినీ ఒక పెద్ద గంపలో వేస్తారు. వాటిని ముందుగా ప్రసాదాల పోటు వద్ద ఉండే పూల బావిలో నిమజ్జనం చేస్తారు. అవి బాగా పరివర్తనం చెందిన అనంతరం పూల బావి నుంచి పూల మాలలను తీసుకెళ్లి మానవ మాత్రులెవరూ కాలు మోపకుండా ఉండే ప్రదేశంలో నిమజ్జనం చేస్తారు.

Share this post with your friends