ఇంట్లోని పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే పాటంచాల్సిన నియమలేంటి?

దాదాపుగా శివ పూజ అంటే అంతా ఆలయానికి వెళ్లి చేసుకుంటారు. ఇంట్లో ఎక్కువగా విగ్రహ ప్రతిష్ట కానీ లింగాన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం వంటివి చేయరు. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట చేసినా లేదంటే లింగాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. ముందుగా ఇంటికి తెచ్చుకునే శివలింగం గొప్పగా ఉండాలని పాలరాతి శివలింగాన్ని తెచ్చి పెట్టుకోకూడదు. ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకున్న తరువాత నిత్యం జ‌ల‌ధార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

అలాగే ఇంట్లో ఒక్క శివ‌లింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉండచుకోవద్దు. ముందుగా వినాయకుడిని పూజించుకున్న మీదటే శివుడిని పూజిచాలి. పూజ చేసే సమయంలో ఓం న‌మః శివాయ అనే మంత్రాన్ని జ‌పించాలి. శివుడని నందివర్ధనం పూలతో అభిషేకిస్తే జీవితంలో సుఖ శాంతులు.. పారిజాతం పూలతో పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయట. అలాగే వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్గాయుష్షు.. సోమవారం రోజున పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్మకం. అయితే శివుడిని ఎప్పుడూ కూడా ఎరుపు రంగు పూలతో పూజించకూడదట.

Share this post with your friends