శివయ్యకు అభిషేకం నిర్వహించే సమయంలో పాటించాల్సిన నియమాలేంటి?

శివాలయంలో చేసే ప్రదక్షిణల గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు అభిషేకం నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. శివలింగాన్ని ఆవు పాలతో అభిషేకం నిర్వహిస్తే మంచిదని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పాలన్నీ ప్యాకెట్లోనే వస్తున్నాయి. మార్కెట్ నుంచి తీసుకొచ్చి ప్యాకెట్‌తోనే అభిషేకించకూడదు. పాలను గ్లాసులోకి తీసుకుని అభిషేకం నిర్వహించాలి. అలాగే జలాభిషేకం చేసేటప్పుడు రాగి లేదంటే స్టీల్ పాత్రలను ఉపయోగించకూడదు. పాలతో అభిషేకించిన తర్వాత మాత్రమే జలాభిషేకం నిర్వహించాలి.

ముఖ్యంగా సోమవారం రోజున శివునికి అభిషేకం నిర్వహిస్తే చాలా మంచిదట. సోమవారం అనేది శివునికి ఇష్టమైన రోజే కాకుండా ఆ రోజున శివుడు కైలాసం నుంచి భూమి పైకి వస్తాడని నమ్మకం. ఇంట్లో లేదంటే శివాలయంలో నువ్వుల నూనెతో శివయ్యకు దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలట. అలాగే శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శ‌రీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుక‌లు పొరపాటున కూడా శివలింగంపై పడనీయకూడదు. అలా ప్రతి ఒక్క విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పూజించాలి.

Share this post with your friends