శివుడిని ఏ రోజున ఏ వస్తువులతో అభిషేకిస్తే ఫలితం ఎలా ఉంటుందంటే..

అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకించే ముందు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నాం కదా. పాలతో అభిషేకిస్తే ఎలా అయినా అభిషేకం నిర్వహించవచ్చు కానీ నీళ్టతో అభిషేకిస్తే మాత్రం పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. అయితే శివుడిని ఏఏ వస్తువులతో అభిషేకిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. శివయ్యను తేనెతో అభిషేకిస్తే మన సమస్త వ్యాధులు నయమవుతాయట. గంగాజలంతో అభిషేకిస్తే వివిధ ప్రయోజనాలు లభిస్తాయట. చెరుకు రసంతో అభిషేకిస్తే ఇంట్లో ప్రశాంతత చేకూరి లాభాలు కలుగుతాయట.

ఇక ఇప్పుడు అభిషేక చేయాల్సిన రోజు.. వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఆదివారం శివుడికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం చాలా కీలకమైనది. ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేస్తే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. మంగళవారం అభిషేకిస్తే దేవతల అనుగ్రహం లభిస్తుందట. బుధవారం శివుడికి ముఖ్యంగా జలాభిషేకం చేయాలట. అలా చేస్తే వివాహ ఆటంకాలన్నీ తొలగిపోతాయట. గురువారం ముఖ్యంగా విద్యార్థులు అభిషేకం చేస్తే చదువులో మంచి విజయం లభిస్తుందని నమ్మకం. శుక్రవారం శివుడిని అభిషేకిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
శనివారం రోజున శివునికి అభిషేకం చేస్తే అకాల మరణ భయం తొలగిపోయి దీర్ఘాయుస్సు లభిస్తుందని నమ్మకం.

Share this post with your friends