వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్.
మత సామరస్యం, కులమతాల మధ్య ఐకమత్యం గురించి మనం ఎన్నో పుస్తకాల్లో చదివాం, ఎంతోమంది గొప్ప వ్యక్తుల మాటల్లో విన్నాం, కానీ ఆచరణలో చూపించేవారు చాలా అరుదు. ఈరోజు మీకు చూపించబోయే ఒక గణేశ మండపం కొన్ని తరాల వారికి స్ఫూర్తిదాయకం. వినాయక చవితి అంటే హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. ప్రతి ఇంట్లో, గల్లీలో, సంస్థలో గణపయ్యను పూజిస్తారు భక్తులు. మరి ఆ బాధ్యత ఒక ముస్లిం యువకుడు తీసుకుంటే.. అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో.. ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 20 ఏళ్ళ నుండి గణేశుని సేవలో ఉంటూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
Watch Khairatabad Ganesh 2024 Detailed Vlog : 70 ఏండ్ల ఘన చరిత్ర.. 150 మంది కార్మికుల 6 నెలల కష్టం
చిన్నతనంలో ఆయనకు పర్సనల్ గా గణేశుని వల్ల జరిగిన మంచి వల్ల ఆనాటి నుంచి ప్రతీ ఏడాది, తన హిందూ మిత్రులతో కలిసి గణేశునికి సేవ చేస్తున్నారు. మొహమ్మద్ సిద్దిఖ్… హైదరాబాద్ రామ్ నగర్ లో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా సిద్దిఖ్ భాయ్ అని పిలుస్తారు. ఆయన స్థాపించిన గణేశ్ మండపానికి వెళ్ళి ఎన్నో ఆసక్తికర విషయాలను మీకు డీటెయిల్డ్ గా ఈ వ్లాగ్ లో తెలియజేశాము. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు చూడండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ను టాప్ చేయండి. అలాగే భక్తివిశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.
మరికొన్ని వ్లాగ్స్ లింక్స్….
1. Watch Harasiddhi Matha & Gad Kalika Mata Ujjain Shakthi Peeth Temples Vlog