ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి రాహు, కేతు దోషమైనా పరార్

కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయనేది తెలిసిందే. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. వీటిలో మనం ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకున్నాం. ఈ మూడు క్షేత్రాలు వేటికవే ప్రత్యేకం. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. కుజ, రాహు, కేతు దోషాలతో పాటు సకల నవగ్రహ దోషాల బారి నుంచి పరిహారం పొందాలంటే.. ఈ మూడు క్షేత్రాలను దర్శించాల్సిందే.

మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఆలయమున్న ప్రదేశం విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని చెబుతారు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కి.మీ దూరంలో ఉంటుంది. శ్రీరాముడు వనవాస కాలంలో కొంతకాలం పాటు నాగలమడక ఉన్నాడని తెలుస్తోంది. ఇక్కడ కొన్ని రోజుల పాటు రామయ్య గడిపిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశం వదలి కామనదుర్గ కాకాద్రి కొండకు వెళ్లాడట. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు. ఈ కొండపై ఇప్పటికీ శ్రీ రాముని ఆలయం ఉంది.

Share this post with your friends