కర్కాటక రాశిలోకి శుక్రుడు.. వీరికి పండగే..

మనిషి జీవితం గ్రహాలపై ఆధారపడి ఉంటుందంటారు. సమయానుసారంగా గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశులను మార్చుకోవడం వలన మనిషి జీవితం ఏదో ఒక రకంగా ప్రభావితం అవుతూనే ఉంటుంది. శుక్రుడు.. రాక్షస గురువుగా.. శుభగ్రహంగా కూడా పరిగణించబడుతూ ఉంటాడు. శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. త్వరలోనే కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి పండగేనట. వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. మరి ఇంతకీ ఆ రాశులేంటి? వారి పరిస్థితి ఎలా ఉండబోతోందో చూద్దాం.

ఏ ఏ రాశుల వారికి బాగుంటుందంటే..

మేషరాశి: మేష రాశి వారికి కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఆదాయ వృద్ధి, వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు.

మిధునరాశి: మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తద్వారా ఆర్థిక వృద్ధి, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవడంతో పాటు అన్ని విధాలుగా మంచి జరుగుతుందట.

కర్కాటక రాశి: శుక్రుడు ఈ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీరికి అంతా శుభమే జరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగవడంతో పాటు ఆదాయ వనరులు, ఆర్థిక పరిస్థితి, వైవాహిక జీవితం అన్నీ బాగుంటాయి.

సింహరాశి: సింహరాశి వారికి వివిధ రంగాలలో విజయాన్ని పొందే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో డబ్బు వెచ్చించి అన్ని విధాలుగా బాగుంటారు.

తులారాశి: ఈ రాశివారికి అయితే పట్టిందల్లా బంగారమేనట. భారీ లాభాలను పొందుతారు. ప్రమోషన్స్, ఉద్యోగంలో జీతం పెరుగుదల వంటివి సంభవిస్తాయట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయట.

Share this post with your friends