తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున సారెను పంపించిన విషయం తెలిసిందే. దీని పౌరాణిక ప్రాశస్త్యం ఏంటంటే.. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్నారు. ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒకటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.
2024-08-05