తిరుప్పావై ప్ర‌వ‌చ‌నకర్తల నుంచి అంగీకార‌ప‌త్రాలకు టీటీడీ ‌ఆహ్వానం

పవిత్రమైన ధనుర్మాసంలో తిరుమలలో తిరుప్పావై ప్రవచనాలు చెబుతుంటారు. ఈ ప్రవచనాలకు టీటీడీ ప్రవచనకర్తల నుంచి అంగీకార పత్రాలను ఆహ్వానిస్నతోంది. ఈ ఏడాది డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు చెప్పేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన విద్వాంసుల నుంచి అంగీకారపత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తోంది. 2015 నుంచి 2023వ సంవ‌త్స‌రం వ‌ర‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు చెప్పిన వారు ఈ సంవ‌త్స‌రం కూడా అంగీకారం తెల‌పాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

హిందూ ధార్మిక ప్రాజెక్టుల‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు అక్టోబ‌రు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502” అనే చిరునామాకు తమ అంగీకారపత్రాలు పంపాల్సి ఉంటుంది. న‌మూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌డం జరిగింది.ఇతర వివరాలకు టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల కార్యాలయాన్ని 9676120226, 8978734947 నంబర్ల‌ను కార్యాల‌య వేళ‌ల్లో సంప్రదించాల్సి ఉంటుంది.

Share this post with your friends