నవ గ్రహాల్లో శుభ గ్రహంగా బుధుడిని పరిగణిసన్తూ ఉంటారు. ప్రస్తుతం తిరుగమనంలో ఉన్న ఈ బుధ గ్రహంలో మార్పుల కారణంగా కొన్ని రాశుల వారిపై శుభ ప్రభావాలను చూపించనుంది. మొదట సింహరాశిలోకి ఆ తరువాత కన్యారాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని పండితులు చెబుతున్నారు. ఇలా బుధుడు రెండు రాశుల్లోకి సచారం చేయడం వలన సెప్టెంబర్ నెలలో భద్ర రాజ యోగం ఏర్పడనుంది. ఇక ఈ భద్ర రాజయోగంలో ఈ రాశుల వారికి పండగే. వారు ఏ పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తవుతాయట.మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహరాశి: భద్ర రాజయోగం కారణంగా ఈ రాశివారి జీవితంలోనే మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా.. అలాగే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక దంపతుల వైవాహిక జీవితంలోనూ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో బాకీలు వసూలు అవడంతో పాటు వ్యాపారంలో లాభాలను సైతం ఆర్జిస్తారు.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశివారికి తల్లిదండ్రుల సపోర్ట్ బాగా లభిస్తుంది. సమస్యల నుంచి బయటపడి ఆర్థికంగానూ బాగుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్.. అలాగే బంగారం వ్యాపారం చేసే వారికి అద్భుత లాభాలుంటాయి. కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేయాలనుకునే ఇది మంచి తరుణం.
కన్య రాశి: ఈ రాశికి చెందిన వారికి కూడా భద్ర రాజయోగం వలన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారి కెరీర్‌లో మంచి మార్పులు.. సమాజంలో గౌరవం రెట్టింపు.. రాజకీయ నాయకులకు శుభ సమయం.. ఇక వ్యాపార సమస్యలకు పరిష్కారంతో పాటు ఆర్దికంగా లాభదాయకంగా ఉంటుంది.