
హిందువులంతా పాటించే తిథుల్లో స్మార్త యోగిని ఏకాదశి అత్యంత ముఖ్యమైనది. దీనిని నేడు (శనివారం) దేశమంతా జరుపుకుంటోంది. ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించుకుని ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలూ తొలగిపోతాయని నమ్మకం. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని మనం యోగిని ఏకాదశి లేదంటే స్మార్త యోగిని ఏకాదశిగా జరుపుకుంటాం. లక్ష్మీదేవిని సైతం ఈ రోజున పూజిస్తే ఆర్థికంగా చాలా బాగుంటుందని నమ్మకం. అలాగే ఉపవాసం ఉండటం వలన జీవితంలోని కష్టాలు తొలగిపోయి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయట.
ఈ ఒక్క ఏకాదశిని ఆచరించడం వల్ల 88,000 బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోగ ఏకాదశి నియమాలు వచ్చేసి ఉపవాసం ఉండాలనుకునేవారు నీరు కూడా తీసుకోకుండా ఉత్తమం. ఉండలేని వారు పండ్లు, పాలు ఉపవాసం తీసుకోవచ్చు. అలాగే తులసి మొక్కకు పూజ చేయడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అలాగే భగవద్గీత వినడం, చదవడం చాలా మంచిది.
యోగిని ఏకాదశి ప్రాముఖ్యతను తెలియజేసే కథేంటంటే..
హేమమాలిని అనే ఒక తోటమాలి, కుబేరుడి కోసం పూలు కోయడానికి వెళ్ళేది. ఒకరోజు ఆమె భర్తతో కలిసి ఉండటం వలన పూలు కోయడానికి ఆలస్యమవడంతో కుబేరుడు కోపం తెచ్చుకుని శపించాడు. ఆ శాప విమోచనం కోసం మార్కండేయ ఋషిని సాయం కోరగా.. ఆయన ఉపదేశంతో యోగిని ఏకాదశి వ్రతం చేసి ఆమె శాపవిముక్తి పొందింది.
