మానసిక ప్రశాంతత కలగాలంటే ఈ మంత్ర జపం చేస్తే చాలు..

మానసిక ప్రశాంతత కోసం మనం ఎంతగానో ఇబ్బందిపడుతూ ఉంటాం. బిజీ లైఫ్.. పని ఒత్తిడి.. మనకోసం మనం సమయాన్ని కేటాయించుకోలేకపోవడం వంటి వాటితో పాటు కుటుంబ సమస్యలు సైతం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మానసిక ప్రశాంతత కరువవుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఒక్క శ్రీకృష్ణుడి మంత్రాన్ని పఠిస్తే చాలు.. అదేంటో తెలుసుకుందాం.

మానసిక ప్రశాంతత కలగాలంటే ఈ మంత్ర జపం చేస్తే చాలు..
మానసిక ప్రశాంతత కలగాలంటే ఈ మంత్ర జపం చేస్తే చాలు..

“కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే.. ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః.”
ఈ పవిత్ర మంత్రం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, అది మనలోని అశాంతిని, కష్టాలను (క్లేశాలను) హరించే ఒక దివ్య శక్తి. ప్రతిరోజూ ఈ నామస్మరణను వినడం వల్ల మనస్సు నిర్మలంగా మారి, సన్మార్గంలో నడిచే ధైర్యం లభిస్తుంది. ముఖ్యంగా మీ గృహంలో సానుకూలతను నింపడానికి, నిత్యం ఒక గంట పాటు నిరంతర మంత్ర జపాన్ని నిత్యం ఆలకించడం కానీ లేదంటే మీరే పఠించడం కానీ చేయండి. దీనిని ఒక ఆధ్యాత్మిక సాధనగా మలచుకోండి.

Share this post with your friends