ఈ ఆలయాన్ని ఏడాదికోసారి మాత్రమే తెరుస్తారు.. దీని విశేషమేంటంటే..

శ్రీ మహావిష్ణువు నివాసం వైకుంఠానికి వెళ్లాలని హిందువులంతా భావిస్తూ ఉంటారు? మోక్షం సిద్ధించడం కోసం ఎన్నో ఉపవాసాలు, పూజలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. కానీ వాస్తవానికి వారికి వైకుంఠం సిద్ధిస్తుందో లేదో తెలియదు. అలాంటి వారు ఈ ఆలయానికి వెళ్తే మోక్షం తప్పక సిద్ధిస్తుందట. అసలు ఈ ఆలయం నుంచే వైకుంఠానికి వెళ్లేందుకు ఒక ద్వారం ఉందని చెబుతారు. అది మరెక్కడో కాదు.. మధురలోనే. ఇక్కడ బృందావన్ దేవాలయాల్లో శ్రీకృష్ణుని గురించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. బృందావనంలో అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.

బృందావనాన్ని శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా పేర్కొంటారు. కన్నయ్య తన బాల్యాన్ని ఇక్కడి ప్రతి వీధిలోనూ గడిపాడని చెబుతారు. మధుర -బృందావన్ దేవాలయాలలో శ్రీకృష్ణుని గురించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని చుంగి చౌరాహా సమీపంలో ఉన్న శ్రీ రంగనాథ ఆలయం. ఇక్కడే వైకుంఠానికి వెళ్లే ద్వారం ఉందట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయం అన్ని ఆలయాల మాదిరిగా ఏడాదంతా తెరచి ఉండదు. కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. కాబట్టి ఆ సమయంలో ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

Share this post with your friends