
భారతదేశంలోని కొన్ని ఆలయాలు.. రామాయణానికి సంబంధించో.. మహాభారతానికి సంబంధించిన ఆనవాళ్లనో కలిగి ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం రామాయణ, మహాభారతాలకు సంబంధించిన ఆనవాళ్లను కలిగి ఉంటుంది. మరి ఆ ఆలయం ఎక్కడుంది? దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
రామతీర్థం గురించి వినే ఉంటారు. ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలోని గ్రామ పంచాయతీలో ఉంటుంది. విజయనగరం నగరానికి 12 కి.మీ. దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో రామతీర్థం ఒకటి.
మరి ఈ ఆలయానికి రామాయణం, మహాభారతంతో ఎలాంటి సంబంధం ఉంది? తెలుసుకుందాం. ఈ ఆలయంలోని దేవతామూర్తులను పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చాడట. సీతమ్మవారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో సంబంధం కలిగి ఉన్నాయి. సీతమ్మవారు లవకుశలకు ఇక్కడే జన్మనిచ్చిందట. పురుటి మంచానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి రాళ్ల నుంచి ఇంగువ వాసన వస్తుందని చెబుతారు. లవకుశలకు సీతమ్మవారు ఇక్కడే ఆడించిందని కూడా చెబుతారు. ఇప్పుడు తెలిసిందా.. రామతీర్థానికి భారతం, రామాయణంలతో ఎలాంటి సంబంధం కలిగి ఉందో..
