ఈ ఆలయమే ఓ పెద్ద మిస్టరీ.. ఏంటో తెలిస్తే షాకవుతారు..

అగ్ని కీలల్లో చిక్కుకుంటే ఇల్లైనా.. ఆలయమైనా స్మాష్ అవుతుంది కదా.. వస్తువులన్నీ బూడిదై పోతాయి. కానీ ఈ ఆలయం దాదాపు మూడు రోజుల పాటు అగ్నికీలల మధ్య ఉన్నా కూడా అమ్మవారి విగ్రహానికి మాత్రం ఏమీ కాదట. చెక్కుచెదరకుండా అంతే ఉంటుందట. అసలు ఈ ఆలయంలో ఎందుకు అగ్ని పుడుతుందో కూడా ఎవరికీ తెలియదట. అగ్ని కీలల మధ్య ఉన్న విగ్రహం ఎందుకు చెక్కు చెదరదో అంతు పట్టదట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటారా? రాజస్థాన్‌లోని ఉదయపుర్ ఆరావళి పర్వతాల్లో ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారిని ఇడాన మాత అని పిలుస్తారు.

నెలలో రెండు మూడు సార్లు ఇడాన్ మాత ఆలయంలో అగ్ని పుడుతుందట. దీంతో భక్తులంతా అమ్మవారు అగ్నిలో స్నానం చేస్తారని నమ్ముతారు. ఈ ఆలయంలో అగ్ని దానంతటదే పుట్టి క్షణాల్లో ఆలయమంతా వ్యాపిస్తుందట. దాదాపు 10 నుంచి 20 అడుగుల మేర ఈ అగ్ని ప్రభావం ఉంటుందట. ఆలయంలోని అమ్మవారి విగ్రహం మినహా ప్రతి వస్తువూ బూడిదై పోతుందట. అసలు ఈ అగ్ని ఎలా వస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా యత్నించారట. కానీ ఏమాత్రం క్లూ కూడా దొరకలేదట. ఈ అగ్నిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారట.

Share this post with your friends