ఈ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ప్రతిష్టించాడట..

మనదేశంలోని ప్రతి ఊరిలోనూ ఏ ఆలయమున్నా లేకున్నా.. శివాలయం మాత్రం తప్పక ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్స్ కూడా ఛేదించలేని విధంగా ఉంటాయి. ఇలాంటి ఆలయాల గురించి మనం ఇప్పటికి చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తమిళనాడులోని అలాంటి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ విచిత్రమేంటంటే.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో ఒకటైన షుగర్ వ్యాధి. ఇది ఉన్నవారు ఈ ఆలయానికి వెళితే.. తప్పక నయమవుతుందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమని చెబుతారు. ఇక్కడికి వెళ్లిన వారికి మధుమేహం తప్పక నయమవుతుందట.

తమిళనాడులోని తంజావూరు నగరానికి 26 కి.మీ దూరంలో ఈ మహిమాన్విత ఆలయం ఉంది. ఇక్కడ అమ్మ పేట అనే మారుమూల గ్రామాంలో వెన్ని కరుంబరేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు మధుమేహం నుంచి బయటపడ్డారట. ఇక్కడికి వెళ్లిన వారు మధుమేహం నుంచి ఎలా బయట పడతారంటే.. చీమల వైద్యం ద్వారా అని చెబుతారు. ఇక ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ప్రతిష్టించాడని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగం పది కాదు.. వంద కాదు.. ఏకంగా ఐదు వేల ఏళ్ల క్రితం నాటిదని ఇక్కడి వారంతా చెబుతారు.

Share this post with your friends