ఈ శివాలయం 5 వేల ఏళ్ల నాటిదట.. ఇక చెరువు శివుడి కన్నీటితో ఏర్పడిందట..

పరమేశ్వరుడికి సంబంధించిన ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో పాకిస్తాన్‌లోని ఓ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇది పాకిస్తాన్‌లోని చక్వాల్ జిల్లాకు దాదాపు 40 కి.మీ.ల దూరంలో ఉంది. 5 వేల ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని కటాసరాజ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శివుడు ఉన్నాడు. ఇక్కడ మరో ఏడు దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి సత్గ్రహ అని పిలుస్తారు. ఇక్కడి చెరువు శివుడి కన్నీటితో ఏర్పడిందట. గర్భాలయంలో శివలింగం ఉంటుంది. ఇక ఇతర ఏడు ఆలయాల్లో విష్ణువు, గణేశుడు, దుర్గాదేవి తదితర దేవతలు ఉంటారు.

ఈ ఆలయ పరిసరాల్లో పాండవులు వనవాసమున్నారట. ఇక చెరువు విషయానికి వస్తే సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞ గుండంలో పడి ప్రాయోప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో శివుడు విపరీతంగా బాధపడ్డాడట. అప్పుడు శివుడి కంట నుంచి వచ్చిన కన్నీళ్లే ఇంత పెద్ద చెరువుగా మారాయని అంటారు. శివుడి కన్నీరు కారణంగానే ఈ ఆలయానికి కటాస్ అని పేరు వచ్చిందట. ఈ చెరువు అప్పట్లో యక్షుని సంరక్షణలో ఉండేదట. అక్కడకు ఎవరైనా నీటి కోసం వస్తే తాగనిచ్చేవారు కాదట. ఒకరోజు నకుల, సహదేవ, అర్జున, భీముడు కుండం వద్ద నీటి కోసం రాగా.. యక్షుడు అడ్డుకున్నాడట. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారంతా స్పృహ కోల్పోయారట. అప్పుడు అర్జనుడు వచ్చి సమాధానం చెప్పి పాండవులతో పాటు నీటిని తీసుకుని వెళ్లాడట..

Share this post with your friends