ఈ అమ్మవారికి వేసవి కాలంలో చెమటలు పడతాయట..

దేశంలోని దేవాలయాలకు ఏమాత్రం కొదువ లేదు. పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు మరింత ప్రత్యేకం. ఎవరికీ అంతుబట్టని మిస్టరీ ఆ ఆలయాల్లో ఉంటుంది. అలాంటి మిస్టరీ ఆలయం ఒకటి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉంది. జబల్‌‌పూర్‌లోని ఓ ఆలయంలో కాళికా దేవి కొలువై ఉంటుంది. ఇక్కడి అమ్మవారికి సంబంధించి ఒక షాకింగ్ విషయం ఉంది. ఈ ఆలయంలో ఏసీ ఆగితే చాలు అమ్మవారికి చెమటలు పట్టేస్తాయట. ఆ కథేంటో తెలుసుకుందాం. చలికాలంలో ఏ ఇబ్బందీ ఉండదట. వేసవి కాలంలో మాత్రం కాళికా మాత విగ్రహానికి చెమటలు పడతాయట.

అమ్మవారికి దుస్తులు మార్చే సమయంలో ఆమె దుస్తులు తడిచి ఉంటాయట. విషయం తెలుసుకున్న భక్తులు అమ్మవారికి కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేశారట. ఈ ఆలయంలో వేసవి కాలంలో 24 గంటల పాటు ఏసీ నడుస్తూనే ఉంటుందట. ఎప్పుడైనా ఏసీ ఆగిపోతే అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు పడతాయట. ఈ ఆలయం 500 ఏళ్లనాటిదని నమ్మకం. ఈ అమ్మవారికి ఏసీ వలీ కాళి దేవి అని పేరు. ఇక ఇలా అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం వెనుక దైవిక శక్తికి నిదర్శనమని కొందరు నమ్ముతారు. కొందరు మాత్రం విగ్రభం తయారు చేసిన రాయిలోని పదార్థం ఆలయ వాతావరణంలోని తేమ కారణంగా ఇలా జరుగుతుందని కొందరంటారు. అయితే సరైన కారణం మాత్రం ఎవరూ గుర్తించలేదు.

Share this post with your friends