పిల్లల్లో దిష్టి దోషాలు తొలగాలంటే ఇలా చేయాలట..

యాక్టివ్‌గా ఉండే పిల్లలు ఒక్కసారిగా డల్ అయిపోవడం.. నీరసించిపోవడం.. చదువుపై ఆసక్తి లేకపోవడం, తలనొప్పి కారణంగానో..కాళ్ల నొప్పి అనో అప్పటి వరకూ ఉరుకులు పరుగులు పెట్టే పిల్లలు ఒక్కసారిగా నీరసించి పోవడం అనేది దిష్టికి సంకేతం. అసలు దిష్టి అంటే ఏంటంటే.. కాంతి పరావర్తనం, పరివర్తనం కారణంగా వస్తువు ఆకారం కనిపిస్తుంది. అలాగే ప్రతి జీవికి ఒక కాంతి వలయం ఉంటుంది. వారి దేహం చర్మం లోపల ఒక విధమైన ఆకర్షణ, తేజస్సు ఉంటుంది. ఈ తేజస్సు ఎంత ఉండాలో అంత ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఎక్కువైనా.. తక్కువైనా డల్ అయిపోతారు.

మనం చూస్తూ కాంతికిరణాన్ని ఆరా అంటాం. ఈ అనారోగ్యం కారణంగా ఆరా తగ్గిపోతుంది. కాంతి వలయంలో ఉండే కాంతి తగ్గినా మనం అనారోగ్యం పాలవుతున్నాం. ఈ దిష్టి కూడా కాంతి వలయానికి సంబంధించినదే. ఇది పిల్లల్లో ఎక్కువ. పెద్దవాళ్లుంటే దిష్టి తీస్తారు. తల వెంట్రుకలను ఒక తాడుగా చేసి కాలికి ముడి వేస్తే దిష్టి పోతుందట. అయితే ఆ వెంట్రుకలు కన్నతల్లివి మాత్రమే అయి ఉండాలట. ఇది ఏ రోజైనా.. ఏ సమయంలోనైనా చేయవచ్చు. అయితే ఈ వెంట్రుకలు కాలిన వెంట్రుకలు అయి ఉండకూడదు. కాలికి కట్టిన తరువాత కూడా వెంట్రుకలు కాలకూడదట. ప్రతి తల్లి కూడా తన పిల్లలకు ఇలా చేస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయట.

Share this post with your friends