హిందువుల ఇంటి దాదాపుగా తులసి మొక్క ఉంటుంది. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. వాస్తవానికి తులసి మొక్కకు రోజూ పూజ చేస్తే కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. అయితే తులసి మొక్కను పూజించడానికి ముందు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. తులసి దగ్గర పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం రావడంతో పాటు మన ఇంట ప్రతికూల ప్రభావాలు ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదట.
ఇక తులసి మొక్క దగ్గర ఉంచకూడనివి ఏంటంటే.. గణపతి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదట. అలాగే తులసి మొక్క దగ్గర శివలింగాన్ని పెట్టి పూజించకూడదట. అలాగే తులసి దగ్గర చీపురు, చెత్త వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదట. చీపురుతో ఇల్లు ఊడుస్తారు కాబట్టి చీపురును తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవని అంటారు. అలాగే తులసి మొక్క దగ్గర చెప్పులు అస్సలు ఉంచకూడదట. అలా చేస్తే మన ఇంట దరిద్రం తాండవిస్తుందని నమ్మకం. తులసి మొక్క దగ్గర ముళ్ల మొక్కలు సైతం ఉండకూడదు. ఇలా ముళ్ల మొక్కలు ఉంటే ఇంట్లో నెగిటివిటీ త్వరగా వ్యాపిస్తుందట.