కార్తీక మాసంలో ఈ తిథులు అత్యంత ప్రత్యేకం..

కార్తీక మాసం ఎంత ప్రత్యేకమో ఆ మాసంలో కొన్ని తిథులు మరింత ప్రత్యేకం. జ్యోతిషశాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు. కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో కూడా ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక కార్తీక మాసంలో కొన్ని తిథులు అత్యంత ప్రత్యేకమని చెప్పుకున్నాం కదా.. అవి ఏంటి? ఆ తిథుల్లో మనం ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు అత్యంత ప్రత్యేకం.

కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిదట. కమలాలతో పూజిస్తే జీవితకాలం ధనానికి లోటుండదట. అలాగే సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదే విధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి. అలా పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలు కలుగుతాయట. అలాగే అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.

Share this post with your friends