
నల్లగొండలోని పానగొల్లులో కొలువైన ఛాయా సోమేశ్వరుడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయంలో పడే నీడ దేనిదనే విషయం ఎవరికీ అంతుబట్టలేదు. దీనిని త్రికూటాలయం అని చెప్పుకున్నాం కదా. ఈ ఆలయంలోని మూడు గర్భగుడులు కూడా ఒకే రీతిగా ఉంటాయి. అయితే ఆసక్తికరంగా.. కేవలం పడమటి గర్భగుడిలో మాత్రమే ఈనీడ కనిపిస్తుంది. ఇలా నీడ కనిపించడాన్ని దేవుడి మాయగా అంతా భావిస్తూ ఉంటారు.
అసలు ఆ నీడ ఎలా ఏర్పడుతుంది? గర్బగుడిలో పడే నీడకు, సూర్యుడి కాంతితో పని ఉండదు. కేవలం పగటి వేళల్లో వెలుతురు మాత్రమే పడేలా ఆ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ నీడ ఇప్పటికీ పెద్ద మిస్టరీయే. ఛాయా సోమేశ్వరాలయంలో నిత్యం మూడు పూటలా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. ఇక మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రికి నిత్యం శివుడికి రుద్రాభిషేకాలు, అన్నాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకున్నా కూడా కలి బాధల నుంచి ఉపశమనం కలుగుతుందట.
