
దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఐదు ఆంజనేయస్వామి ఆలయాల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఆరు ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బేడి హనుమాన్: ఇది ఒడిశాలోని పురీ జగన్నాథ ఆలయంలో ఉంది. పురీ ఆలయ దక్షిణ ద్వారంలో ఉన్న హనుమంతుడు “బేడి హనుమాన్”గా పిలువబడతాడు. సముద్రం నుండి రక్షణకు సీతాదేవి ఆయనను జాలంతో కట్టినట్లు కథ.
సుచీంద్రం తానుమాలయన్ ఆలయం: ఇది తమిళనాడులో ఉంది. రాముడి గర్భగుడిని ఎదురుగా చూస్తున్న 22 అడుగుల హనుమంతుడు. దక్షిణ భారతదేశంలో శిల్పశాస్త్ర విశిష్టతను కలిగిన విగ్రహం. ఇది నాగర్‌కోయిల్ రైల్వే స్టేషన్ లేదంటే కేరళలోని త్రివేండ్రం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి కూడా వెళ్లవచ్చు.
పరిటాల ఆంజనేయ ఆలయం: ఇది ఏపీలో ఉంది. 176 అడుగుల హనుమంతుడి విగ్రహం ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హనుమంత ఆలయాలలో ఒకటి.
బడే హనుమాన్ ఆలయం: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంటుంది. లేతే హనుమాన్ రూపంలో ఉన్న ఏకైక ఆలయం. విగ్రహం గంగలో భాగంగా మునిగినట్లుగా ఉంటుంది. పవిత్రతకు సంకేతం.
జఖూ ఆలయం: హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో ఉంది. సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో 108 అడుగుల విగ్రహం. సంజీవని బూటి తేచే దారిలో హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న చోటుగా ప్రఖ్యాతిగాంచింది.
జఖూ ఆలయం: ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో ఉంది.
అంజనాద్రి కొండ: కర్ణాటకలోని హంపీలో ఉంది. హనుమంతుని జన్మస్థలంగా పరిగణించబడే ఈ కొండపై ఉన్న ఆలయం. బాల హనుమంతుని ఆలయం మరియు 575 మెట్లు ఎక్కి చేరవచ్చు.
