మౌని అమావాస్య నాడు మూడో రాజస్నానం.. ఈ రోజున కుంభమేళాలో స్నానమాచరిస్తే..

రేపటి నుంచి భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవమైన మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఈ మేళాలో మొత్తంగా ఆరు రాజస్నానాలు నిర్వహిస్తారని తెలుసుకున్నాం కదా. వాటిలో మొదటి రాజస్నానం రేపే చేయనున్నారు. ప్రతీ రాజస్నానం చాలా కీలకమైనదే. వీటిలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే మూడవ రాజ స్నానం మరింత కీలకం. దీనిని అతిపెద్ద రాజస్నానంగా భావిస్తారు. మౌని అమావాస్య కారణంగా ఈ మూడవ రాజస్నానానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రోజున నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అలాంటిది కుంభమేళాలో స్నానమాచరిస్తే ఫలితం మహాద్భుతంగా ఉంటుంది.

అసలు ఇంతకీ మౌని అమావాస్య ఎప్పుడనేది ముందుగా తెలుసుకుందాం. జనవరి 29న పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. సాధారణంగానే మౌని అమావాస్య నాడు నదీ స్నానం, దానాలకు విశిష్ట స్థానం ఉంది. అసలు ఈ రోజున రాజ స్నానం చేసేందుకు శుభ సమయం, బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.25 నుంచి ప్రారంభమై సాయంత్రం 6:18 గంటల వరకూ ఉంటుంది. ఈ సమయంలో చేసే నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య పూర్వీకులకు మోక్షాన్నిస్తుందట. కాబట్టి ఈ రోజున చేసే నదీ స్నానానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది.

Share this post with your friends