బ్రహ్మ దేవునికి దత్తాత్రేయుడు వేదాలను స్ఫురింపజేసిన కథేంటంటే..

త్రిమూర్తుల అంశతో అత్రి మహర్షి, అనసూయ దంపతులకు జన్మించిన సంతానమే దత్తాత్రేయుడు. ఆయన కథలు చాలా ఉన్నాయి. ఒకానొక సమయంలో బ్రహ్మ దేవునికి బుద్ధి నశించి వేదాలను మరిచి పోయాడట. ఆ సమయంలో ఆయనకు వేదాలను గుర్తు చేయాలని వేదమాత్ర గాయత్రీ దేవి.. దత్తాత్రేయుడిని ఆదేశించిందట. దీంతో బ్రహ్మకు వేదాలను తిరిగి వివరించి స్ఫురించేలా చేశాడట. ప్రహ్లాదుడికి సైతం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడట. ఒకసారి ప్రహ్లాదుడు అసలు తానెవరిని కుమిలిపోతుండగా అతనికి దివ్యమూర్తి దత్తుడు ఆత్మజ్ఞానం ప్రసాదించాడని చెబుతారు. దత్తాత్రేయుడు తనను నమ్ముకున్న వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కార్త్యవీర్యునికి జ్ఞానయోగాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించాడు.

అహింస, సహనం అన్నింటిలో కెల్లా ఉత్తమమైన ధర్మాలని.. సహనం, శాంతంతో క్రోధాన్ని జయించవచ్చని, ప్రతికూల పరిస్థితులలో మౌనంగా ఉండాలని సూచించాడు. ఎల్లప్పుడూ ప్రియభాషణంతో అందరితో సఖ్యంగా ఉండాలని దత్తబోధలు తెలియజేస్తాయి. సత్సాంగత్యం మనిషిని మహానుభావునిగా మారుస్తుందని తెలిపే ఎన్నో కథలు దత్తపురాణంలో ఉంటాయి. దత్తాత్రేయస్వామి పలు చోట్ల పలు రూపాల్లో వెలిశాడని చెబుతారు. శ్రీపాద వల్లభుడుగా గాణగాపురంలో, కురుపురంలో నృసింహ సరస్వతిగా వెలిశాడని చెబుతారు. షిర్డీలో సాయిబాబా కూడా దత్తాత్రేయుని అవతారమేనని కొందరు చెబుతారు.

Share this post with your friends