ఇండోనేషియాలోని అత్యంత ఎత్తైన శ్రీ మహా విష్ణువు విగ్రహ నిర్మాణం వెనుక కథేంటంటే..

మన దేశంలో దేవాలయాలకు కొదువేం లేదు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక్కటైనా దేవాలయం ఉంటుంది. అయితే వాటిలోని విగ్రహాలు కొన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు విగ్రహం గురించి చెప్పుకుందాం. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే… అత్యంత ఎత్తైన విగ్రహం కావడమే. అసలు ఈ విగ్రహం ఎక్కడ నిర్మించారు? దీని కోసం ఎంత ఖర్చైంది? వంటి విషయాలను తెలుసుకుందాం. అత్యంత ఎత్తైన శ్రీ మహావిష్ణువు విగ్రహం మన దేశంలో లేదు. ఇండోనేషియాలో ఉంది. దీని నిర్మాణానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చైంది.

ఇండోనేషియాలోని విష్ణుమూర్తి విగ్రహం దాదాపు 122 అడుగుల ఎత్తు.. 64 అడుగుల వెడల్పుతో అత్యంత భారీగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని రాగి, ఇత్తడి కలబోతతో నిర్మించారు. ఈ విగ్రహ నిర్మాణానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 సంవత్సరాలు పట్టింది. 2018లో విష్ణు దేవుడి విగ్రహం పూర్తిగా సిద్ధమైంది. ఈ విగ్రహం నిర్మించడం వెనుక ఒక కథ ఉందిం. 1979లో ఇండోనేషియాకు చెందిన శిల్ప బప్పా సుమన్ నువర్తా అనే వ్యక్తి ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడట. ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయతలపించి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. దీనికోసం కొంత డబ్బుతో 1994లో నిర్మాణాన్ని ప్రారంభించాడు. సుధీర్ఘ కాలం ప్రణాళిక చేసి.. అందుకు కాస్త డబ్బు పొగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించారు. కానీ డబ్బు కొరత కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. స్థానికులు సైతం ఈ విగ్రహ నిర్మాణానికి అభ్యంతరం తెలిపారు. పర్యాటకం తద్వారా ఆదాయం లభిస్తుందని తెలియజేయడంతో వారు శాంతించారు. విగ్రహం తయారీ దాతల సహకారంతో తిరిగి ప్రారంభమై 2018లో పూర్తైంది.

Share this post with your friends