జగన్నాథుని ఆలయంలో సముద్ర అలల శబ్ధం వినిపించదు.. కారణమేంటంటే..

పూరి జగన్నాథుని ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆలయం అంటే పక్కాగా పక్షులు ఉంటూనే ఉంటాయి. కానీ ఈ ఆలయంపై ఒక్క పక్షి అంటే ఒక్క పక్షి కూడా వాలదు. నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించకున్నా కూడా ఒక్క విమానం కూడా ఆలయం పై నుంచి ఎగురదు. కారణమేంటనేది ఎవ్వరికీ తెలియదు. ఇక స్వామివారి మహాప్రసాదంగా 56 రుచికరమైన వంటకాలను చేస్తారు. వాటిని 5 దశల్లో జగన్నాథునికి వడ్డిస్తారు. వీటిని సుఖిల, శంఖుడి పేర్లతో రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సుఖిలలో అన్ని పొడి మిఠాయిలు ఉంటాయి. శంఖుడిలో బియ్యం, పప్పు, ఇతర రకాలు ఉంటాయి. మహాప్రసాదం 5 దశల్లో జగన్నాథునికి వడ్డిస్తారు మరియు 56 రుచికరమైన వంటకాలను కలిగి ఉంటుంది.

ఇది సుఖిల మరియు శంఖుడి అని రెండు రకాలు. సుఖిలలో అన్ని పొడి మిఠాయిలు ఉండగా.. శంఖుడిలో బియ్యం, పప్పు, ఇతర వస్తువులు ఉంటాయి. ఇక ఈ మహాప్రసాదాన్ని వేలాది మంది పూజారులు 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి కట్టెల పొయ్యి మీద వండుతారు. మొదటి పైభాగంలోని ఆహారాన్ని ఆ తరువాత మిగిలినవి వండుతారు. ఇలా ఎందుకనేది ఎవరికీ తెలియదు. ఇక ఆలయంలోకి అడుగు పెట్టగానే సముద్ర శబ్దం మనకి వినిపించదు. ఆలయం సముద్ర శబ్దాన్ని మ్యూట్ చేయడానికి ఓ కారణముంది. అదేంటంటే.. సుభద్రా దేవి ఈ ఆలయం ప్రశాంతమైన ప్రదేశంగా ఉండాలని కోరుకుందట. కాబట్టి ఆలయం సముద్ర శబ్దాన్ని మ్యూట్ చేస్తుందని అంటారు. మరో కారణమేంటంటే.. ఆలయాన్ని రక్షించే బాధ్యత హనుమంతుడికి జగన్నాథుడు అప్పగించాడని అంటారు. కాబట్టి జగన్నాథుడి నిద్రకు ఆటంకం లేకుండా సముద్ర శబ్దాన్ని హనుమంతుడు అడ్డుకుంటాడని చెబుతారు.

Share this post with your friends