సింహాగిరిపై ఘనంగా విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం

సింహాద్రి అప్పన్న సింహాగిరిపై ఘనంగా విష్ణుసాహస్ర నామము, భగవద్గీత పారాయణం జరిగింది. సుమారు రెండు వేల మంది మహిళా భక్తులు ఈ పారాయణలో పాల్గొన్నారు. జేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని, స్వామివారి మూడవ విడత చందన సమర్పణ సందర్భంగా భారీగా తరలి వచ్చి భగవద్గీత పారాయణలు జరిపారు. సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, వారి సిబ్బంది సహాయ సహకారాలతో ఈ పారాయణాన్ని భక్తులు పఠించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటివి ఇటువంటి పారాయణాలే అన్నారు. పారాయణలు ప్రతి భక్తులు స్వామి సన్నిధిలో చెయ్యడం వలన ఆరోగ్యంతో పాటు ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు పుష్కాలంగా అందుతాయని అన్నారు.

ప్రతి సంవత్సరం ఈ అప్పన్న దేవాలయంలో పౌర్ణమి రోజున, చందన సమర్పణ నాడు స్వామిని స్తుతిస్తూ ఇటువంటి పారాయణలను ముఖ్యంగా మహిళలంతా చేయడం అనవాయితీగా వస్తోందని అన్నారు. సింహాచలం దేవస్థానం ఈవో, వారి సిబ్బంది కూడా పారాయణకు వచ్చిన భక్తులందరికి అన్న ప్రసాదాన్ని, దర్శనాన్ని ఉచితంగా అందిస్తున్నారని, వారికి కృతఙ్ఞతలు తెలిపారు నిర్వాహకులు.

సర్వం విష్ణు మయం జగత్ !!

Share this post with your friends