
ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో ఉన్న శతన్ దేవి ఆలయం ఒక ప్రసిద్ధ చెందిన చారిత్రక, మతపరమైన ప్రదేశం ఉందని తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం చిల్డ్రన్స్ టెంపుల్ పేరుతో ప్రసిద్ధి చెందింది. అసలు ఈ ఆలయం చిల్డ్రన్స్ టెంపుల్‌గా ప్రసిద్ది కావడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారికి పిల్లలు లేనివారు భక్తితో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సంతానం లేని వారు సంతానం పొందుతారట. అమ్మవారి దయతో సంతానం పొందిన వారు.. ఆ తరువాత మొక్కు ఎలా తీరుస్తారో తెలుసా? బిడ్డ జన్మించిన తరువాత భక్తులు తిరిగి ఇక్కడికి వచ్చి గుడిలో గోరింటాకు, కర్ర పెండలంను నైవేద్యంగా సమర్పిస్తారు.
అమ్మవారికి గోరింటాకు సమర్పించే సంప్రదాయం ఈనాటిది కాదు.. శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని నమ్మకం. మాతా శంతన్ దేవి ఆలయం గురించి ఒక నమ్మకం కూడా ఉంది. ఈ అమ్మవారిని మొక్కితే తప్పక కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని పూజించుకుంటారు. అందుకే ఈ ఆలయాన్ని కోరికల దేవాలయం అని కూడా పిలుస్తారు. పిల్లలున్న వారు సైతం ఈ ఆలయానికి వచ్చి తమ పిల్లలకు దీర్ఘాయుస్సుని, ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వమని శంతన్ దేవి అమ్మవారిని ప్రార్థిస్తారు.
