కోటప్పకొండపై కాకులు వాలకపోవడానికి కారణమేంటంటే..

కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి అని మనం వింటూనే ఉంటాం. అసలు నిజంగా కాకులు దూరని ప్రదేశం ఎక్కడైనా ఉందా? అంటే నిజంగానే ఉంది. ఒక కొండపై కాకులు పొరపాటున కూడా వాలవట. సాధారణంగా ఇప్పుడు కాస్త కాకుల సంఖ్య తగ్గినా కూడా కొండ ప్రాంతాలపై.. అలాగే ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఓ కొండపై మాత్రం కాకులు వాలవు. అసలు ఆ కొండ ఎక్కడుంది? ఆ కొండపై కాకులు వాలకపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం.

ఆ కొండ ఎక్కడో లేదు. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న త్రికూటాద్రిపై కాకులు వాలవు. ఇది కోటప్ప కొండగా ప్రసిద్ధి గాంచింది. కోటప్ప కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఒక శాపమేనట. కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు కొలువై ఉంటాడు. ఇది గొప్ప శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని “త్రికుటాద్రి అని పిలుస్తారు.

Share this post with your friends