హిందూ వివాహ వేడుకలో అమ్మాయి ఒంటిపై అడిషనల్‌గా చాలా యాడ్ అవుతాయి. నుదుటున బొట్టు, మెడలో సూత్రాలు, నల్లపూసలు, మెట్టెలు వంటివి పెళ్లి తర్వాత అమ్మాయి ధరిస్తుంది. అప్పుడే ఆమెకు వివాహితగా గుర్తింపు లభిస్తుంది. మన సంప్రదాయంలో ఒక్కో నియమానికి ఒక శాస్త్రీయ కోణం అయితే ఉంది. మరి కాలి వేళ్లకు మెట్టెలు ఎందుకు పెడతారో తెలుసా? పెళ్లిలో మేనమామ ఈ మెట్టెలను పెడతారు. ఇది పురాతన కాలం నుంచి కూడా వస్తున్న సంప్రదాయం. పెళ్లైన స్త్రీ మెట్టెలు ధరించడం వెనుక ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
సాధారణంగా మెట్టెలను పాదంలోని ఏ వేలుకి పెడతారో అందరికీ తెలిసిందే. బొటన వేలు పక్కనున్న వేలికి అంటే రెండవ కాలి వేలుకి మెట్టెలను పెడతారు. ఈ వేలు నుంచి ఒక నిర్దిష్ట నాడి గర్భాశయానికి అనుసంథానించబడి గుండె ద్వారా వెళుతుంది. ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తూ గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రుతుచక్రాన్ని సైతం క్రమబద్ధీకరిస్తుందట. కాబట్టి ఈ వేలుకి మెట్టెలు ధరిస్తే గర్భాశయం బలపడుతుందట. తద్వారా మాతృత్వ సమయంలో ఇబ్బందులు ఉండవట. పైగా మనం కాలి వేలుకి వెండిని ధరిస్తాం. అది సౌరశక్తిని గ్రహించి శరీరాన్ని చల్లగా ఉంచుతుందట. కాబట్టి వివాహమైన స్త్రీ కాలికి మెట్టెలు పెట్టుకోవడం చాలా మంచిదట.