నాగలోకాన్ని మరపించే నాగదేవత ఆలయం.. ఎక్కడంటే..

సికింద్రాబాద్‌లో మనకు తెలియని దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాగలోకాన్ని మరపించే నాగమ్మ దేవాలయం ఒకటి. ఇంత అద్భుతమైన దేవాలయం మరొకటి తెలంగాణలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఇప్పటికీ దేవతా సర్పమైన శ్వేతనాగు సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తుందని చెబుతారు. ఈ ఆలయం ఈనాటిది కాదు.. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. ఒకప్పుడు బ్రిటీష్ వారు యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ ఆలయం అడ్డు ఉందని కూల్చేశారట. ఆ తరువాత ఆశ్చర్యకరంగా, మరుసటి శుక్రవారం నాడు బ్రిటిష్ అధికారి, అతని గుర్రం, పెంపుడు కుక్క ఆలయం ముందు చనిపోయి కనిపించాయట.

చాలా మంది రాహు, కేతు దోషాలతో పాటు పెళ్లి, సంతాన దోషాలు ఉంటాయి. అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తే చాలు.. వాటిన్నింటిని నుంచి గట్టెక్కుతారని నమ్మకం. మూడు రోజుల పాటు దోషాలు కలిగిన వారు పూజ చేసిన నాగ ప్రతిష్ట చేస్తే దోషాలన్నీ మాయమవుతాయని చెబుతారు. ఈ ఆలయాన్ని జయలక్ష్మి నిర్మించారు. ఒకరోజు నాగదేవత ఈమె కలలోకి వచ్చి తనకు ఆలయం నిర్మించాలన ఆదేశించారు. దీంతో జయలక్ష్మి.. నాగదేవత ఆలయాన్ని నిర్మించారు. జయలక్ష్మి విగ్రహం కూడా మనకు ఆలయంలో కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ ఆలయాన్ని కూడా తప్పక సందర్శించండి.

Share this post with your friends