మహాగణపతి యంత్రాన్ని ప్రతిష్టించిన కంచి పీఠాధిపతి..

వైజాగ్‌లోని సంపత్ వినాయకుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. స్థానికంగా నివసించే జాలర్లు తప్పక ఈ స్వామిని నిత్యం దర్శించుుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుని భక్తితో దీపం పెట్టి పూజలు చేసిన తర్వాతనే సముద్రంపైకి చేపలు పట్టడానికి వెళుతుంటారట. అలాగే కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1966-67 ప్రాంతంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారట. ఆ సమయంలోనే ఈ ఆలయంలో ‘మహాగణపతి యంత్రాన్ని’ ప్రతిష్ఠించారు. దీంతో విశాఖ చుట్టుపక్కలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సంపత్ వినాయక మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.

సంపత్ వినాయగర్ ఆలయంలో నిత్య పూజలను అర్చకులు నిర్వహిస్తుంటారు. నిత్యం ‘గరిక పూజ’, ‘ఉండ్రాళ్ళ నివేదన’, ‘అభిషేకము’, ‘గణపతి హోమం’, ‘వాహన పూజలు’ విశేషంగా జరుగుతాయి. ప్రతీ మాసంలో బహుళ చతుర్థి నాడు ‘సంకష్టహర చతుర్థి’ పూజతో పాటు అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జరుగుతుంది. అలాగే ఈ రోజున నిర్వహించే అభిషేకం చాలా ప్రత్యేకమైనది. గంధోదకం, హరిద్రోదకం, ఆవుపాలు,పెరుగు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫల రసాలు, తేనె, శుద్ధోదకం, పంచదారతో స్వామివారిని అభిషేకిస్తారు. తరువాత, అర్చకస్వాములు, స్వామివారికి అలంకరణ చేస్తారు.

Share this post with your friends