శ్రీరాముడి కోపాన్ని పరీక్షించాలనుకున్న దేవతలు.. తర్వాత ఏం జరిగిందంటే..

శ్రీరాముడు, సీతమ్మతో కలిసి కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెయ్యి నూతల కోన ప్రాంతానికి వచ్చారని తెలుసుకున్నాం కదా. అక్కడ సీతమ్మతో కలిసి రాముల వారు ఆనందంగా అరణ్యవాసాన్ని గడుపుతుండటం చూసిన దేవతలకు.. అసలు ఆయనకు కోపం రాదా? అనే సందేహం వచ్చిందట. దాని నివృత్తి కోసం ఇంద్రుడి కుమారుడైన కాకాసురుడిని సీతమ్మ దగ్గరికి కాకి రూపంలో పంపారట. కాకిని చూసిన సీతమ్మ చిన్న మట్టిగడ్డను దానిపైకి విసిరిందట. సీతమ్మ వక్షోజాలపై కాకి గాయపరిచిందట. దీంతో సీతమ్మ తన వడ్డాణాన్ని కాకిపైకి విసిరిందట.

ఆ తరువాత సీతమ్మవారి ఒడిలో రాముల వారు పడుకున్న సమయంలో మరోసారి కాకి వచ్చి ఆమెను గాయపరచడం ప్రారంభించిందట. అప్పుడు సీతమ్మకు గాయమై దాని నుంచి రక్తం కారి శ్రీరాముల వారి నుదుటిపై పడిందట. వెంటనే లేచి చూసిన రాముల వారు సీతమ్మకు అయిన గాయాన్ని చూసి ఆవేదన చెందడట. వెంటనే అమ్మవారిని గాయపరిచిన కాకిపైకి బ్రహ్మాస్త్రాన్ని వదిలాడట. అప్పుడు కాకి బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకునేందుకు ముల్లోకాలు తిరిగిందట. అయినా దాని నుంచి తప్పించుకోవడం సాధ్యపడకపోవడంతో తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో శ్రీరాముడి కాళ్ళ మీద పడిందట. అప్పుడు కాకిని శ్రీరాముడు క్షమించాడు. బ్రహ్మాస్త్రానికి వెనక్కి తీసుకోవడం సాధ్యపడదు కాబట్టి తన కన్నును కాకి బలిగా ఇచ్చింట. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఇకపై నువ్వు కనిపించకూడదని శపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకు చక్రంతో ముద్ర వేశాడట. అప్పటి నుంచి వెయ్యి నూతలకోన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఒక్కటంటే ఒక్క కాకి కూడా కనిపించదట.

Share this post with your friends