తిరుమల శ్రీవారిని ఏడుకొండలవాడు అని పిలుస్తారు. అంటే ఏడు కొండలపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. అయితే ఈ ఏడు కొండు ఏడు శక్తి స్థానాలకి చిహ్నమట. మరి మొదటి మూడు కొండలు ఏ శక్తి స్థానాలకు ప్రతీకలో తెలుసుకుందాం.
1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాం. అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది.
అందుకే మొదటి కొండకి.. శేషాద్రి అని పేరు వచ్చింది.
2. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం. అందుకే రెండవ కొండకి .. వేదాద్రి అని పేరు.
3. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. “గ ‘ కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు. అందుకే మూడవ కొండకి.. ‘గ’రుడాద్రి’ అనే పేరు వచ్చింది.