శ్రీనివాసుడికి గోవింద నామం అలా వచ్చింది..

శ్రీనివాసుడు తన భార్య పద్మావతిని వెంటబెట్టుకుని అగస్త్యుని ఆశ్రమానికి వెళ్లాడు. అయితే శిష్యులు మాత్రం తమ గురువు గారి అనుమతి లేనిదే శ్రీనివాసుడికి ఆవును ఇవ్వలేమని తెలిపారు. దీంతో లక్ష్మీదేవితో తాను వచ్చినట్టుగా అగస్త్యునికి చెప్పమని ఆయన శిష్యులకు చెప్పి నారాయణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శ్రీనివాసుడు అక్కడి నుంచి వెళ్లగానే అగస్త్యుల వారు వచ్చారు. శిష్యులు జరిగిందంతా ఆయనకు వివరించారు. సమయానికి తాను ఆశ్రమంలో లేకపోవడం తన దురదృష్టమని చెప్పారు. అలాగే స్వామివారికి ఎలాగైనా గోవును ఇవ్వాలని భావించి వెంటనే గోశాలకు వెళ్లాడు. అక్కడ మేలు జాతి ఆవును తీసుకుని శ్రీనివాసుడు వెళ్లిన వైపు పరుగులు తీశాడు.

అలా పరిగెత్తిన అగస్త్యుడికి శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారితో వెళుతూ కనిపించాడు. వెంటనే ఆవును వెంటబెట్టుకుని వెళ్లి ‘స్వామీ.. గోవు ఇందా అని అరుస్తూ అగస్త్యుడు వారి వెనుక పరుగులు తీశాడు. గోవు ఇందా అంటే ఆవు ఇదిగో అని అర్థం. అలా ఒక్కసారి కాదు.. ఏకంగా 108 సార్లు గోవు ఇందా అని అగస్త్యుడు పరిగెత్తాడు. అలా గోవు ఇందా కాస్తా గోవిందాగా మారిపోయింది. 108 సార్లు పిలిచిన మీదట కానీ శ్రీనివాసుడు ఆగలేదు. ఆ తరువాత ఆగిపోయిన స్వామివారు.. ‘మునీశ్వరా నువ్వు నాకు గోవును అప్పగించేందుకు అంతలా గోవిందా అంటూ పరిగెత్తావు. అది నాకెంతో ఇష్టమైన పిలుపు. కాబట్టి ఇక మీదట భక్తులు సైతం నన్ను గోవిందా అని పిలుస్తారని అగస్త్యుడికి చెప్పాడు. అలా భక్తులంతా గోవిందా నామస్మరణ చేయడం పరిపాటిగా మారింది.

Share this post with your friends