ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఖబీస్ బాబా ఆలయం ఉంది. ఖబీస్ అనే సాధువు శివభక్తుడు. ఆయన శివుడిని ప్రార్ధిస్తూ శివైఖ్యం చెందాడు. ఆయన శివైక్యం చెందిన చోటే శిష్యులు ఆలయం నిర్మించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీర్చమంటూ ఆల్కహాల్‌ను సమర్పిస్తారు. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మీద రెండు చీలికలు ఉంటాయి. ఆ రెండు చీలికల్లో ఒకదానిలో భక్తులు మద్యాన్ని పోస్తారు. ఇక తాము తీసుకొచ్చిన మద్యం మిగిలి ఉంటే భక్తులకు సమర్పిస్తారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కాళీమాత ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రసాదంగా విస్కీ, వైన్ తదితర ఎన్నో రకాల లిక్కర్లలను నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత భక్తులకు విస్కీ, వైన్‌ని ప్రసాదంగా అందిస్తారు.
కేరళ రాష్ట్రంలోని పరస్సినిక్కడవు మదప్పురం ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారికి చేపలు, తాటి కల్లు, మాంసాన్ని , అల్కాహాల్ (ఫుల్ లేదా ఆఫ్ బాటిల్)ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తయ్యాక వీటినే భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు.
ఒడిశాలోని విమల ఆలయం ఉంటుంది. ఇక్కడ విమలమ్మ కొలువై ఉంటుంది. ఇదొక శక్తిపీఠం. అమ్మవారికి ప్రసాదంగా చేపలు, మటన్ నైవేద్యంగా నైవేద్యం పెడతారు. దుర్గా దేవి రూపంగా పరిగణించబడే విమల మాత, జగన్నాథ ఆలయ సముదాయం లోపల ఉంది.