మెట్లకు బంగారు రంగుల అద్దకంతో శోభాయమానంగా శ్రీవారి పుష్కరిణి..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణిలోనికి నేటి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులను టీటీడీ అనుమతిస్తోంది. కాగా ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్‌ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు.

అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు (పెయింటింగ్‌) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమత్తు పనులు పూర్తిచేశారు. అయితే గత నెల స్వామి పుష్కరిణి మరమత్తుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. మొత్తానికి నేటి నుంచి భక్తులను కూడా పుష్కరిణిలోనికి టీటీడీ అనుమతిస్తోంది. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళుతున్నారు.

Share this post with your friends