
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీకి భారీ ఆదాయం రికార్డ్ స్థాయిలో సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత 2022 మార్చి నుంచి శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటోందని ఈ సందర్భంగా టీటీడీ పేర్కొంది. తాగాజాగా టీటీడీ జులై నెలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని వెల్లడించింది. జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.125 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది. ఇది వాస్తవానికి రికార్డ్ స్థాయి ఆదాయమే. స్వామివారిని దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
2020 లో కరోనా మహామ్మారి కారణంగా కొంతకాలం పాటు ఆలయాన్ని మూసివేశారు. ఆ తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు తెరిచారు. అప్పట్లో పెద్దగా భక్తులు వెళ్లేవారు కాదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందనుకున్న తర్వాత మాత్రం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేవారు. 2022 మార్చి నుంచి తిరుమల స్వామివారి హుండీ ఆదాయం రూ.100 మార్క్‌ను అందుకుంటూనే ఉంది. ఎక్కువ శాతం రూ.120 కోట్లను కూడా రాబట్టింది. అయితే ఈ నెల మాత్రం రూ.125 కోట్లకు చేరుకుంది.
