మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందని చెప్పిన ఆమెకు శ్రీరాముడి సమాధానమేంటంటే..

భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటన్నింటికీ ఓ ప్రత్యేక విశిష్టత అయితే ఉంది. అలాంటి వాటిలో టాప్ ప్లేస్‌లో నిలిచే ఆలయం జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోందీ ఆలయం. వైష్ణోదేవిని దర్శించుకున్న వారికి మోక్షం తప్పక లభిస్తుందట. కాట్రాకు సమీపంలో ఉండే ఈ ఆలయం ఈనాటిది కాదట. రుగ్వేదకాలం నుంచి ఉందట. సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచుకొండ‌ల మధ్య వైష్ణోదేవి ఆలయం ఉంటుంది. ఇక ఈ వైష్ణోదేవి ఆలయం గురించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే.. దక్షిణభారతంలో రత్నాకరుడు అనే దుర్గా దేవి భక్తుడు ఉండేవాడు.

అతనితో పాటు అతని భార్య దుర్గామాత ఆరాధకులు. నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించేవారు. వీరికి సంతానం లేకపోవడంతో అమ్మవారిని ప్రార్థించగా.. సాక్షాత్తూ అమ్మవారే వారికి కూతురుగా జన్మించిందట. ఆ చిన్నారికి రత్నాకరుడి దంపతులు వైష్ణవి అని నామకరణం చేశారు. ఆమే కాలక్రమంలో వైష్ణోదేవిగా మారింది. లక్ష్మీ, సరస్వతీ, పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే ఈ వైష్ణోదేవి. శ్రీరాముడిపై ఆమెకు విపరీతమైన భక్తి. ఈక్రమంలోనే అరణ్యంలోకెళ్లి తపస్సు చేయగా వైష్ణోదేవికి శ్రీరాముని దర్శనం లభించింది. అయితే శ్రీరాముడిని చూసిన తర్వాత ఆయనను వివాహం చేసుకోవాలని ఉందని చెబుతుంది. కానీ శ్రీరాముడు తాను ఏకపత్నీ వ్రతుడినని.. ఈ జన్మకు సాధ్యం కాదని చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తాను వైష్ణోదేవిని కలిసినప్పుడు ఆమె గుర్తు పడితే వివాహం చేసుకుంటానని చెప్పాడట.

Share this post with your friends