
టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.
అదేవిధంగా, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 4 నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఉదయం 4 నుంచి 5 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.
నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 నుంచి 6 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పించనున్నారు.
