కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ విశ్వావసు నామ ప్రత్యేక కార్యక్రమాలు ఉగాది పండుగ సందర్భంగా భక్తి టీవీ అందించనుంది. ఈ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా భక్తి టీవీలో ప్రసారం కానున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలను ప్రేక్షకుల కోసం ప్రకటించింది. శుభోదయాన్ని ఆకాంక్షిస్తూ ఉగాది పండుగ నాడు ఉదయం వేదసూక్తం ప్రసారం కానుంది. అనంతరం రాబోయే కాల పరిస్థితులను తెలియజేస్తూ డా. సీవీబీ సుబ్రహ్మణ్యం, డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రిల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగనుంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే శుభ ఉగాది కార్యక్రమం ప్రసారం కానుంది. భవిష్యత్తుపై భరోసా కల్పించే సమగ్ర రాశి ఫలాలు శ్రీ శ్రీనివాస గార్గేయచే విజయోగస్తు ఉగాది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయిచే షడ్రుచుల విశిష్టత. విశ్వావసు ఉగాది డా. సాగి కమలాకరశర్మచే విశ్వావసు రాశి ఫలితాలు. అనంతరం మహిళా లోకానికి దిక్సూచి ములుగు శివజ్యోతిచే మహిళా పంచాంగం. కమ్మనైన తెలుగుదనం నిండిన సంకీర్తనా కుసుమాలు. పండుగ తెచ్చే ఆనందభరిత జానపద గీతాలు ప్రసారం కానున్నాయి.