ఆ శివలింగాన్ని సగరుడే వచ్చి నిత్యం అభిషేకిస్తాడట.. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా..

పరమేశ్వరుడిని భోళా శంకరుడని కూడా అంటారు. చిన్న చెంబుడు నీళ్లతో జలాభిషేకం చేసినా చాలు.. శివుడు పొంగిపోయి కోరిన వరం ఇస్తాడట. అందుకే శివయ్యకు భక్త గణం చాలా ఎక్కువ. శివుడి మహిమలకు అంతమంటూ ఏమీ లేదు. శివాలయాల్లో చాలా వరకూ మిస్టరీగా ఉంటాయి. కొన్ని శివాలయ రహస్యాలను అయితే శాస్త్రవేత్తలు సైతంచేదించలేకపోయారు. అలాంటి శివాలయాల్లో ఒక దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ శివాలయ మిస్టరీ ఏంటంటారా? రోజుకు రెండు సార్లు శివలింగం అదృశ్యమై కాసేపటికి తిరిగి కనిపిస్తుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇది అక్షరాలా నిజం.

గుజరాత్‌లోని స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గుజరాత్‌లోని వడోదరకు 40 కి.మీ దూరంలో ఉండే ఈ ఆలయం పేరు జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ శివాలయం అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. దీనిలో అద్భుతమేంటో మనం పైన చెప్పుకున్నాం కదా.. ఈ ఆలయంలో శివలింగం అదృశ్యమై తిరిగి కొంత సేపటి తర్వాత దర్శనమిస్తుంది. అసలు శివలింగం ఎలా అదృశ్యమవుతుందో.. తిరిగి ఎలా కనిపిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కనీసం శాస్త్రవేత్తలు సైతం ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. అయితే శివునికి జలాభిషేకం చేయడానికి స్వయంగా సగరుడు వస్తాడని.. ఆ సమయంలో శివుడు అదృశ్యమవుతాడని స్థానికుల నమ్మకం.

Share this post with your friends