కొంత మంది ఎంతో కష్టపడుతుంటారు కానీ మనశ్శాంతి అనేదే ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక బాధ.. నిరాశ.. ఇబ్బందులు చుట్టుముడుతూనే ఉంటాయి. దీనికి ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీ. ఏ పని తలపెట్టినా కూడా కలిసిరాదు. పైగా కుటుంబంలోనూ కలతలు, కలహాలు. ఇలాంటి వారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చిట్కాలు పాటించడం వలన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలున్నా తొలగిపోయి జీవితం ప్రశాంతంగా మారుతుందట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయట. కాబట్టి ముందుగా నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి తీసివేయాలి.
ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి కలశానికి ఉందట. దీనిని ఈశాన్య మూలలో పెట్టి వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలట. అలాగే నెగిటివ్ శక్తిని తొలగించడంలో ఉప్పు చాలా ఉపయోగపడుతుందట. ఇంటిని ఉప్పు నీళ్లతో తుడవడం, ఉప్పును ఇంటి మూలల్లో వేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగి పోతుందట. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని పెడితే నెగిటివ్ ఎనర్జీ గడప దాటి లోపలికి రాదట. అలాగే ప్రతిరోజూ సాయంత్రం కర్పూరాన్ని వెలిగిస్తే.. నెగిటివ్ ఎనర్జీ పోతుందట. ఎవరికి వీలైన చిట్కాను వారు పాటించి నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుంచి తరిమేయండి.