దయచేసి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి సమీపంలో మసీదు నిర్మాణం చేయకండి : రంగరాజన్

తిరుమల తిరుపతి దేవస్థానంలో విధించిన నియమాలనే చిలుకూరు బాలాజీ ఆలయంలోనూ విధించాలని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ డిమాండ్ చేస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న చిలుకూరు బాలాజీ క్షేత్రానికి మత ఘర్షణలు రాకుండా అందరూ కలిసి జీవించేలా ఆ మత పెద్దలను ప్రార్థిస్తున్నట్టు రంగరాజన్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామివారునేరుగా దిగి వచ్చిన క్షేత్రం.. చిలుకూరు బాలాజీ క్షేత్రమని అన్నారు. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకు ఏ నియమాలు వర్తిస్తాయో.. అదే నియమాలు వర్తిస్తాయని రంగరాజన్న తెలిపారు.

తిరుమల క్షేత్రం చుట్టూ రెండు కిలో మీటర్ల రేడియస్‌లో ఏ అన్యమత సంస్థ కానీ.. ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదన్నారు. ఆ జీవోని తీసుకురావాలని ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నామని రంగరాజన్ అన్నారు. నూతనంగా ఒక మసీదును నిర్మించాలని ప్రయత్నం జరుగుతున్నందున ఇది కోరుతున్నామన్నారు. వాళ్లు కూడా మా సోదరులే.. వాళ్లంటే మాకు అభిమానమేనన్నారు. ఇక్కడ ఏమైనా కొత్తగా మసీదు నిర్మాణం చేయవద్దని ప్రభుత్వాన్ని అందరినీ ప్రార్థిస్తున్నామన్నారు. ఇంతకు ముందు ఉన్న మాదిరిగా యథాతథంగా ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాగాన్ని.. జిల్లా కలెక్టర్‌ని ప్రార్థిస్తున్నానన్నారు. దయచేసి ఏ ప్రయత్నమైనా జరిగి ఉంటే దానిని విరమించుకోవాలని మా సోదరులను ప్రార్థిస్తున్నానని రంగరాజన్ తెలిపారు.

Share this post with your friends