
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఆషాఢం సారె సమర్పిస్తున్నారు. పెనుగంచిప్రోలులో రంగుల మండపం నుంచి తిరుపతమ్మ దేవస్థానం వరకూ సారెతో మహిళలంతా ఊరేగింపుగా వస్తారు. ఆ తర్వాత.. ఆలయానికి చేరుకుని..అమ్మవారికి సారెను సమర్పిస్తారు. ఈ సారెలో భాగంగా చీర, పసుపు, కుంకుమ, గాజులను వేద పండితుల మంత్రోచరణల మధ్య అమ్మవారితోపాటు.. సహ దేవతలకు అందజేస్తూ ఉంటారు. ఆషాఢమాసమంతా ఆలయాన్ని దర్శించుకునే మహిళలు సారెను సమర్పిస్తూనే ఉంటారు. ఈ ఆషాఢమాసం ఆగష్టు 4న ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. ఏపీలో ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ తిరుపతాంబ “శక్తి” ప్రతిరూపంగా పూజింపబడుతోంది. ఆమె తన భక్తులకు జీవితంలోని సద్గుణాలను ఉపదేశించింది. ముదిరాజ్ పాపమాంబ అమ్మవారికి ప్రధాన భక్తురాలు. ఆమె ముదిరాజ్ పాపమాంబ కుటుంబ సభ్యులను ఆలయంలో పూజలు, సేవలను నిర్వహించమని ఆదేశించింది. జానపద కథల ప్రకారం, పురాతన కాలంలో పెనుగంచిప్రోలులో 101 దేవాలయాలు ఉండేవి. అయితే వాటిని పెదకాంచీపురంగా గుర్తించారు. గుడి పక్కనే మునియేరు అనే వాగు ఉండేది.
