ఈ అమ్మవారికి గోరింటాకే నైవేద్యం..

భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు. కొన్ని అక్కడ నిర్వహించే కార్యక్రమాల కారణంగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో ఉన్న శతన్ దేవి ఆలయం ఒక ప్రసిద్ధ చెందిన చారిత్రక, మతపరమైన ప్రదేశం. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. కాబట్టి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఈ ఆలయం రతన్‌పూర్ కోట సమీపంలో ఉంది. శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో మాతా శతన్ దేవి కొలువై ఉంటుంది.

స్థానికులు ఈ ఆలయాన్ని ‘పిల్లల దేవాలయం’ అని కూడా పిలుస్తారు. దీనికి కారణమేంటంటే.. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే సంతానం లేనివారికి అమ్మవారి కృపతో సంతానం కలుగుతుందట. ఏ దేవాలయమైనా సరే.. అక్కడ కొలువైన దేవత లేదంటే స్వామివారికి స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కొబ్బరి కాయ వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో మాత్రం గోరింటాకు, కర్రల పెండలాన్ని ప్రసాదంగా లేదా నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో ఈ ఆలయం మరింత ఆసక్తికరంగా మారింది.

Share this post with your friends