జూలై 5 నుంచి నారాయణవనం శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు జూలై 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయ. జూలై 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 5వ తేదీ ఉదయం 5.45 నుంచి 6.45 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జూలై 12వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది.

స్వామివారి వాహన సేవల వివరాలు..

జూలై 6వ తేదీన సింహ వాహనం
జూలై 7న హంస వాహనం
జూలై 8న శేష వాహనం
జూలై 9న నంది వాహనం
జూలై 10న గజ వాహనం
జూలై 11వ తేదీన రథోత్సవం
జూలై 12వ తేదీన స్వామివారి కల్యాణోత్సవం, అశ్వ వాహనసేవ
జూలై 13న నటరాజస్వామివారి ఉత్సవం, రావణేశ్వర వాహనసేవ
జూలై 14వ తేదీన త్రిశూలస్నానం, ధ్వజావరోహణం

Share this post with your friends